కలం, నిర్మల్ : కేంద్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తుందని నిర్మల్ (Nirmal) డీసీసీ అధ్యక్షుడు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) అన్నారు. కేంద్ర ప్రభుత్వం విద్యావ్యవస్థలో చేస్తున్న దోపిడీని వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాంధీ పార్కులో మహాత్ముని విగ్రహం ఎదుట బుధవారం కాంగ్రెస్ నాయకులు శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ విద్య వ్యవస్థలోని లోపాలను విద్యార్థుల స్వరాన్ని ప్రభుత్వానికి చేరవేసే లక్ష్యంగా లోక్ సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ చాత్రోన్ కీ గుంజ్ పేరుతో సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులపై ఆర్థిక భారం మోపుతోందని బొజ్జు పటేల్ (Vedma Bojju Patel) విమర్శించారు. నీట్ లాంటి ప్రవేశ పరీక్షల కోసం దేశ విద్య బడ్జెట్ మొత్తాన్ని తల్లిదండ్రుల నుంచి సమకూర్చుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల లోపాల వంటి అంశాలపై విద్యార్థులు తమ అభిప్రాయాలను వెల్లడించాలన్నారు. అనంతరం సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
Read Also: కొత్తగా బాస్ స్కామ్.. పోలీసుల బిగ్ అలర్ట్
Follow Us On: Instagram

