కలం, స్పోర్ట్స్ : సింగపూర్‌లో జరుగుతున్న ప్రతిష్టాత్మక ‘ఎన్‌బీఏ రైజింగ్ స్టార్స్ ఇన్విటేషనల్ టోర్నమెంట్’ లో (NBA Rising Stars) చెన్నైకి చెందిన వేలమ్మాళ్ ఇంటర్నేషనల్ స్కూల్ భారత్ తరఫున ఏకైక ప్రతినిధిగా బరిలోకి దిగింది. మంగళవారం ఉదయం ఈ జట్టు మైదానంలో అడుగుపెట్టింది. దేశీయంగా అద్భుత విజయాలు సాధించిన ఈ జట్టును బాస్కెట్‌బాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ టోర్నీకి సిఫార్సు చేసింది. తాము గెలవడానికే వచ్చామని, భారత బాస్కెట్ బాల్ వేగాన్ని చూపిస్తామని స్టార్ ప్లేయర్ కుశాల్ సింగ్ మ్యాచ్‌కు ముందు తెలిపాడు.
ఎన్‌బీఏ (NBA Rising Stars)లో ఆడిన మొదటి భారతీయుడిగా నిలవడమే కుశాల్ లక్ష్యం కాగా, దేశానికి ఒలింపిక్ పతకం తేవడమే పాయింట్ గార్డ్ ఫ్యోడర్ ప్రేమ్ ఆశయం. కాగా, చైనా, జపాన్ దేశాలతో పోలిస్తే భారత్‌లో పాఠశాల స్థాయిలో క్రీడలకు మద్దతు, మౌలిక వసతులు పెరగాలని కోచ్ శంషేర్ బాషా అభిప్రాయపడ్డారు. టోర్నీలో భాగంగా ఇండోనేషియా జూబ్లీ హైస్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో వేలమ్మాళ్ జట్టు మొదటి రెండు క్వార్టర్లలో గట్టి పోటీ ఇచ్చింది.
కుశాల్, ఫ్యోడర్ అద్భుతంగా రాణించారు. అయితే, వీసా సమస్యల వల్ల ముగ్గురు కీలక ఆటగాళ్లు రాలేకపోవడం, మూడో క్వార్టర్ లో స్టామినా తగ్గడంతో వేలమ్మాళ్ జట్టు 95-61 తేడాతో ఓడిపోయింది. ఓటమి ఎదురైనా, అంతర్జాతీయ స్థాయి పోటీ ద్వారా తాము ఎక్కడ మెరుగవ్వాలో అర్థమైందని, తదుపరిసారి మరింత బలంగా తిరిగొస్తామని ఆటగాళ్లు నమ్మకంగా చెప్పారు.
Read Also: కొత్తగా బాస్ స్కామ్.. పోలీసుల బిగ్ అలర్ట్
Follow Us On: X(Twitter)

