Mobile Popup Ad
Mobile Popup Ad

ఉప సర్పంచుల సంఘం హన్వాడ మండల అధ్యక్షుడిగా ఎన్.శంకర్ నాయక్

కలం, మహబూబ్ నగర్ బ్యూరో : తెలంగాణ ఉప సర్పంచుల సంఘం హన్వాడ (Hanwada) మండల నూతన అధ్యక్షుడిగా దాచక్ పల్లి గ్రామ ఉప సర్పంచ్ ఎన్. శంకర్ నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుధవారం హన్వాడ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మండల స్థాయి ఉపసర్పంచుల ఫోరం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి శంకర్, జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ సమక్షంలో ఎన్.శంకర్ నాయక్ ని ఎన్నిక పత్రం అందజేశారు.

ఉప సర్పంచ్‌ల సంఘం మండల (Hanwada) అధ్యక్షుడిగా ఎన్నికైన ఎన్.శంకర్ నాయక్ కి సిపిఐ మహబూబ్ నగర్ నియోజకవర్గ కార్యదర్శి పి‌.సురేష్, వివిధ గ్రామాలకు సర్పంచులు, రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల నాయకులు అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా యన్.శంకర్ నాయక్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, వారి హక్కుల సాధనకు, ప్రజా ప్రతినిధుల ఆత్మగౌరవం కృషి చేస్తానని తెలిపారు.

Read Also: ఎల్ నినోను ఎదుర్కొందాం.. కరువును జయించే పంటలను పండిద్దాం!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>