కలం, వెబ్ డెస్క్: రాయలసీమ ప్రాంతం రానున్న రోజుల్లో రతనాల సీమగా మారనుందని, స్వర్ణాంధ్ర ప్రదేశ్ అనే కల సాకారం కానుందని సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. కర్నూలులోని జొన్నగిరి గోల్డ్ మైన్స్ (Jonnagiri Gold Mines) ప్రారంభం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. చమురు తర్వాత దేశంలో ఎక్కువగా దిగుమతి చేసుకునేది బంగారమేనని సీఎం అన్నారు. ఆ బంగారం ఇప్పుడు మన దగ్గర ఉత్పత్తి కాబోతోందని చెప్పారు. రాయలసీమ చరిత్రలో సువర్ణ అధ్యాయం మొదలైందని సీఎం చెప్పారు. జొన్నగిరికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని సీఎం గుర్తు చేశారు. జొన్నగిరి వజ్రాలు, బంగారానికి నిలయమన్నారు.
గతంలో దీన్ని స్వర్ణగిరి (Swarnagiri) అని పిలిచేవారని, ఇప్పుడు మళ్లీ దీన్ని స్వర్ణగిరి అని పిలుద్దామా అంటూ ప్రజలను ఉత్సాహపరిచారు. రాబోయే రోజుల్లో దేశమంతా జొన్నగిరి గురించి మాట్లాడుకుంటుందని సీఎం అన్నారు. ఇప్పటి వరకు జొన్నగిరిలో 400 కిలోల బంగారం వెలికితీశారని, ఏడాదికి టన్నుకు పైగా వెలికితీస్తారని తెలిపారు. ఈ ప్రాజెక్టుతో 5 వేల మందికి ఉద్యోగాలు లభించాయని చెప్పారు. ఇక రాయలసీమలో సాగు నీటి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేస్తున్నట్లు సీఎం తెలిపారు. రాయలసీమలో సాగుతో పాటు జొన్నగిరి గోల్డ్ మైన్‌తో పసిడి పంటలు పండాలని ఆకాంక్షించారు. ఈ ప్రాజెక్టుతో రాయలసీమ దశ, దిశ మారాలని కోరారు. శ్రీవారి పవిత్రతను కాపాడతామని, రాయలసీమకు మళ్లీ రాయల్ రేంజ్ తీసుకొస్తామని సీఎం (Chandrababu) హామీ ఇచ్చారు.
Read Also: ఖబడ్దార్ జాగ్రత్త.. వైసీపీకి సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్
Follow Us On: X(Twitter)

