కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ 2027కు ముందు జరిగిన రిషభ్ పంత్-కుల్దీప్ యాదవ్ ట్రేడ్‌పై మాజీ భారత స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చినప్పటికీ, జట్టు కెప్టెన్‌గా మాత్రం కేఎల్ రాహుల్‌ను కొనసాగించాలని ఆయన సూచించాడు. ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఈ భారీ ట్రేడ్‌లో పంత్ ఢిల్లీకి, కుల్దీప్ యాదవ్ లక్నోకు మారారు. అయితే ఒకే ఒక్క నిరాశాజనక సీజన్ కారణంగా ప్రపంచ స్థాయి స్పిన్నర్ కుల్దీప్ను వదులుకోవడం తనకు అర్థం కాలేదని అశ్విన్ పేర్కొన్నాడు.
2026 సీజన్లో ఢిల్లీ జట్టు పలు తప్పిదాలు చేసినప్పటికీ, పెద్దగా మార్పులు అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డాడు. అక్షర్ పటేల్ స్థానంలో కేఎల్ రాహుల్‌కు కెప్టెన్సీ అప్పగించి ఉంటే జట్టు మరింత మెరుగైన స్థితిలో ఉండేదని చెప్పాడు. ఈ ట్రేడ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కే ఎక్కువ లాభం జరిగిందని అశ్విన్ అభిప్రాయపడ్డాడు. కుల్దీప్ రూపంలో నాణ్యమైన భారత స్పిన్నర్‌ను దక్కించుకోవడంతో పాటు, వేలానికి అదనపు నిధులు కూడా లభించాయని వివరించాడు.
అలాగే పంత్‌ను సరైన బ్యాటింగ్ స్థానంలో ఉపయోగించడం ఢిల్లీకి కీలకమని అశ్విన్ (Ravichandran Ashwin) సూచించాడు. అతడిని ఓపెనర్‌గా లేదా చివరి ఓవర్లలో ఆడిస్తే మంచి ఫలితాలు వస్తాయని, మధ్య ఓవర్లలో ఉపయోగించడం సరైన వ్యూహం కాదని పేర్కొన్నాడు.

