Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్ జిల్లాలో భారీ ఇసుక డంప్‌ సీజ్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) కమిషనరేట్ పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలు, నిల్వలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. సీపీ గౌష్ ఆలం ఆదేశాల మేరకు కొత్తపల్లి మండలంలోని బావుపేట పరిధిలో అక్రమంగా నిల్వ ఉంచిన 75 ట్రాక్టర్ లోడ్‌ల ఇసుక డంప్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకున్నారు. అక్రమ మైనింగ్ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కేసులు నమోదు చేస్తామని సీపీ గౌష్ ఆలం హెచ్చరించారు. స్వాధీనం చేసుకున్న ఇసుకను తదుపరి చర్యల కోసం సంబంధిత పోలీస్ స్టేషన్లకు అప్పగించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>