Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ ముక్త్ భారత్ బీజేపీ లక్ష్యం: బోయినపల్లి ప్రవీణ్ రావు

కలం, కరీంనగర్ బ్యూరో: దేశ ప్రజలు ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని, కాంగ్రెస్ ముక్త్ భారత్ అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీజేపీ పార్లమెంట్ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు (Boinpally Praveen Rao) అన్నారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన్ దివస్ సందర్భంగా మంగళవారం రోజున కరీంనగర్ పార్లమెంటు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన (Boinpally Praveen Rao) మాట్లాడుతూ.. శ్యామా ప్రసాద్ ముఖర్జీ కన్న కలలను ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా ముఖర్జీకి నిజమైన నివాళి అర్పించామని తెలిపారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రాణత్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని, ఆయన మార్గంలోనే దేశాభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతితో నిండిపోయిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారని వివరించారు. రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా బీజేపీ తిరుగులేని శక్తిగా అవతరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>