Mobile Popup Ad
Mobile Popup Ad

వర్షాభావ పరిస్థితుల్లో ఆ పంటలే పండించాలి: నల్లగొండ కలెక్టర్

కలం, నల్లగొండ: రైతులు వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పంటలను ఎంచుకోవాలని నల్లగొండ కలెక్టర్ (Nalgonda Collector) బి.చంద్రశేఖర్ చెప్పారు. మంగళవారం ఆయన కనగల్ మండల కేంద్రంలో రైతు వేదిక (Rythu Vedika)లో నిర్వహించిన విత్తనమేళా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా కురిసే అవకాశం ఉందన్నారు. రానున్న సీజన్లో నీరు తగ్గే అవకాశం ఉందని, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నీరు తక్కువ అవసరమయ్యే పంటలను సాగు చేయాలని సూచించారు.

మెరుగైన విత్తనాలు, మెరుగైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే సరైన దిగుబడులు పొందవచ్చని తెలిపారు. ఈ సమయంలో రైతు వేదికలలో వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలను తీసుకోవాలని అన్నారు. వరి పండించే రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు ఆలోచించాలని, అలాగే వరిలో సన్న రకాల పండించాలన్నారు. ముఖ్యంగా వర్షం తక్కువగా ఉన్న సమయంలో ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు.

అనంతరం కలెక్టర్ (Nalgonda Collector) కనగల్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ సమీపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న హ్యాం రోడ్ల పైలాన్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పైలాన్ తో పాటు, పరిసరాలు, రైలింగ్, సుందరీకరణ పనులపై ఇంజనీరింగ్ అధికారులకు సలహాలు చేశారు. కలెక్టర్ వెంట వ్యవసాయ అధికారి, తహసీల్దార్ పద్మ, శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు.

Read Also: టీమిండియాలోకి కొత్త ఆల్‌రౌండర్.. షెడ్గేకు ఛాన్స్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>