Mobile Popup Ad
Mobile Popup Ad

లోయలో పడిపోయిన జీపు.. ప్రభుత్వ టీచర్లకు గాయాలు

కలం, వెబ్ డెస్క్: నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు ప్రభుత్వ టీచర్లు (Teachers Injured) గాయపడ్డారు. హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై అమ్రాబాద్ నుంచి అచ్చంపేటకు 12 మందితో వస్తున్న ప్రైవేట్ జీపు నల్లమల అటవీ (Nallamala Forest) ప్రాంతంలో అదుపు తప్పి వంద అడుగుల లోయలో పడిపోయింది. ఈ ఘటనలో సుమారు పది మందికి తీవ్ర గాయాలు కాగా, వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల్లో పలువురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, పిల్లలు కూడా ఉన్నారు.

ఉచిత బస్సు ప్రయాణం మొదలైనప్పటి నుంచి సరిపడా బస్సులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు టీచర్లు పేర్కొన్నారు. ఉదయం 8 గంటలకు, సాయంత్రం 4 గంటల సమయంలో తమకు ప్రత్యేకంగా ఒక బస్సు వేయాలని ఎన్నిసార్లు డిపో అధికారులను కోరినా పట్టించుకోవడం లేదన్నారు. అమ్రాబాద్ ప్రాంతంలో డ్యూటీ చేయాలంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని.. సరిపడా బస్సులు లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ప్రైవేట్ జీపులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also: మహిళల టీ20 ప్రపంచకప్‌.. యూనిసెఫ్ కోసం ప్రత్యేక మ్యాచ్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>