Mobile Popup Ad
Mobile Popup Ad

రాగి పాత్రలో నీరు తాగుతున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ప్రమాదమే!

కలం, వెబ్ డెస్క్: రాగిపాత్రలో నీరు (Copper Water) తాగడం అనేది ఆయుర్వేదంలోను, ఆధునిక ఆరోగ్య నియమాల్లోనూ ఎంతో ప్రయోజనకరమైన సాంప్రదాయంగా పరిగణించబడుతుంది. రాగి (Copper) మన శరీరానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. నీటిని రాగి పాత్రలో నిల్వ ఉంచి తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే ఈ మధ్య కాలంలో చాలా మంది రాగి బాటిల్లు, రాగి పాత్రలలో నీరు తాగడం దినచర్యగా మార్చుకున్నారు. అయితే పాత్రలను సరైన పద్ధతిలో ఉపయోగించకపోతే శరీరానికి తీవ్రమైన హాని (Health Risks) జరుగుతుందని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. రాగి పాత్రలను ఉపయోగించేటప్పుడు చేయకూడని తప్పుల గురించి వివరించారు.

1. నీటిని ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచడం

రాగి పాత్రలు లేదా బాటిళ్లలో నీటిని ఎక్కువ కాలం నిల్వ ఉంచవద్దని చెబుతున్నారు నిపుణులు. 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే నిల్వ ఉంచాలట. ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంచిన నీరు ఎక్కువ మొత్తంలో రాగిని గ్రహిస్తుంది. ఇది కొంతమంది శరీరానికి అస్సలు మంచిది కాదట. అందుకే రాగి పాత్రలలో ఎప్పటికప్పుడు తాజా నీటిని నింపుతుండాలని చెబుతున్నారు.

2. ఆమ్ల పదార్థాలను నిల్వ చేయడం

ఆమ్ల పదార్థాలను రాగి పాత్రలో నిల్వ ఉంచవద్దని చెబుతున్నారు నిపుణులు. ఆమ్ల పదార్థాలైన నిమ్మరసం, చింతపండు నీరు, వెనిగర్, విభిన్న రకాల జ్యూస్‌లు లేదా ఇతర ఆమ్ల (సిట్రిక్) గుణాలున్న పదార్థాలు రాగి లోహంతో చర్య జరిపి, ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన సమ్మేళనాలను ఏర్పరుస్తాయని చెబుతున్నారు. అందుకే రాగి పాత్రలలో పుల్లని పదార్థాలు నిల్వచేయవద్దట. కేవలం సాధారణ మంచి నీటిని నిల్వ చేయడానికి రాగి పాత్రను ఉపయోగించాలని చెబుతున్నారు.

3. పాత్రను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోవడం

కొంతమంది రాగి పాత్రలను శుభ్రం చేయకుండా చాలా రోజుల పాటు ఉపయోగిస్తారు. అది అస్సలు మంచిదికాదు. రాగి పాత్రలను క్రమం తప్పకుండా శుభ్రం చేయకపోతే, వాటి పరిశుభ్రత దెబ్బతిని బ్యాక్టీరియా చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే రాగి పాత్రలను నిమ్మరసం, ఉప్పు లేదా మార్కెట్లో లభించే రాగి క్లీనర్‌లను ఉపయోగించి లోపల, బయట శుభ్రం చేయాలి. ఇలా క్రమం తప్పకుండా శుభ్రం చేయడం వల్ల పాత్రలు చూడటానికి అందంగా కనబడతాయి. అంతే కాకుండా వాటిలోని నీరు (Copper Water) తాగడానికి కూడా సురక్షితంగా ఉంటుంది.

Read Also: మొటిమలతో ఇబ్బందిపడుతున్నారా? ఈ సహజ చిట్కాలు ట్రై చేయండి

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>