కలం, వెబ్ డెస్క్: సీనియర్ హీరోయిన్ త్రిష (Trisha) మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కొద్ది రోజుల వరకు తమిళనాడు సీఎం విజయ్ (Vijay), త్రిష ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ విజయ్ భార్య విడాకులు కోరడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో త్రిష, విజయ్ జంటగా ఓ పెళ్లికి అటెండ్ అయ్యారు. విజయ్ ఎన్నికల్లో గెలుపొందిన సమయంలో త్రిష తిరుపతి వెళ్లడం, ఆ తర్వాత అదే రోజు విజయ్ ఇంటికి వెళ్లి ప్రత్యేకంగా విష్ చేయడం జరిగింది. ఇక వీరిద్దరూ రిలేషన్షిప్లో ఉన్నారన్నది ఖాయమని, రేపో మాపో పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేస్తోందని అంతా భావించారు. ఇక్కడే కథ మరో మలుపు తిరిగింది.
సోమవారం విజయ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు సినీ, రాజకీయ ప్రముఖులు విషెస్ చెప్పారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేశారు. కొందరు సెలబ్రెటీలు విజయ్‌ని స్పెషల్‌గా కలిశారు. అయితే నెటిజన్లు త్రిష ఎప్పుడు విషెస్ చెప్తుందా.. ఏం పోస్ట్ చేస్తుందా.. అని ఎదురుచూశారు. కానీ, అందరికీ షాకిస్తూ త్రిష విజయ్ బర్త్ డేకి సోషల్ మీడియాలో విషెస్ చెప్పలేదు. ఇక పర్సనల్‌గా చెప్పినట్లు కూడా ఎక్కడా రివీల్ కాలేదు. గత కొన్నేళ్లుగా ప్రతి సంవత్సరం త్రిష విజయ్‌కి బర్త్‌డే విషెస్ చెప్తూ వస్తోంది. ఇక 2025లో అయితే ఒక స్పెషల్ ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్ డే టూ ద బెస్టెస్ట్ అని పోస్ట్ చేసింది. మరి ఇప్పుడు ఎందుకు విషెస్ చెప్పలేదన్నది హాట్ టాపిక్‌గా మారింది.
ఇదే సమయంలో త్రిష విజయ్‌ని సోషల్ మీడియా వేదిన ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసినట్లు వార్తలు రావడం మొదలైంది. రూమర్లకు చెక్ పెట్టేందుకే త్రిష ఇలాంటి నిర్ణయం తీసుకుందని ప్రచారం నడుస్తోంది. అయితే అసలు త్రిష విజయ్‌ని ఎప్పుడూ ఫాలో అవ్వలేదని కొందరు నెటిజన్లు చెప్తున్నారు. విజయ్ బర్త్ డేకి త్రిష విషెస్ చెప్పకపోవడం, ఇన్ స్టాలో అన్ ఫాలో వ్యవహారంపై సోషల్ మీడియా పెద్ద చర్చే నడుస్తోంది. కొందరైతే వీరిద్దరు విడిపోయినట్లు ఉన్నారని కామెంట్ చేస్తున్నారు. మరికొందరు వాళ్లు మంచి ఫ్రెండ్స్ అని, రూమర్లకు చెక్ పెట్టేందుకే త్రిష దూరంగా ఉంటోందని చెప్తున్నారు. ఏదేమైనా మరోసారి విజయ్, త్రిష జంటగా కనిపిస్తే తప్ప ఈ చర్చకు ముగింపు పడేలా లేదు.

