Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు ఢిల్లీలో ఘనంగా పద్మ అవార్డుల ప్రదానోత్సవం..

కలం, వెబ్ డెస్క్ : నేడు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల (Padma Awards 2026) ప్రదానోత్సవం ఘనంగా జరగనుంది. రెండో విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) వివిధ రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మొత్తం 65 పద్మ అవార్డులు అందజేయనున్నారు. వీటిలో 2 పద్మ విభూషణ్, 7 పద్మ భూషణ్, 56 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి.

కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న మొత్తం 131 పద్మ అవార్డులను ప్రకటించగా, వాటిలో మిగిలిన అవార్డులను నేడు ప్రదానం చేయనున్నారు.  సాయంత్రం రాష్ట్రపతి భవన్‌లో జరిగే ఈ వేడుకకు ఉపరాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నారు. కళలు, సాహిత్యం, క్రీడలు, సామాజిక సేవ, వైద్యం, విజ్ఞాన శాస్త్రం తదితర రంగాలలో విశేష కృషి చేసిన వ్యక్తులకు ఈ పురస్కారాలు అందజేయబడతాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>