కలం, వెబ్ డెస్క్: ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ కోచింగ్ సెంటరులో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 15 మంది మరణించారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) పరిహారం ప్రకటించారు. ఘటనా స్థలాన్ని సీఎం స్వయంగా పరిశీలించి కారణాలను అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఇంకా లోపల ఎవరైనా చిక్కుకున్నారా.. అని ఆరా తీశారు. అనంతరం, చికిత్స పొందుతున్న కింగ్ జార్జ్ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. ఈ ఘటనపై ఇప్పటికే ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది.

