Mobile Popup Ad
Mobile Popup Ad

కేంద్రం వల్లే తెలంగాణ రైతాంగం బతుకుతోంది: ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

కలం, భువనగిరి: తెలంగాణ రైతాంగం సంతోషంగా బతుకుతోంది అంటే దానికి కేంద్ర ప్రభుత్వ విధానాలే కారణమని చేవెళ్ల ఎంపీ (Chevella MP) కొండా విశ్వేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రైతు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు బస్వపురం లక్ష్మీనరసయ్యతో కలిసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కేవలం గొప్పలు చెప్పుకోవడానికే పరిమితమైందని, క్షేత్రస్థాయిలో చేసింది శూన్యమని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వరంగల్ డిక్లరేషన్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం ఉత్త మాటలకే పరిమితమయ్యారని ఎద్దేవా చేశారు.

కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తెలంగాణ నుంచి ఏకంగా 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసిందని ఎంపీ (Chevella MP) వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణ నుంచే అత్యధికంగా 1/3 వంతు ధాన్య సేకరణ కేంద్ర ప్రభుత్వం చేసిందని, రైతు బంధువుగా నిలిచిందని గుర్తుచేశారు. దేశంలో రసాయన ఎరువుల వాడకం విపరీతంగా పెరగడం వల్ల ప్రజల ఆరోగ్యాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని విశ్వేశ్వర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వరి ధాన్యానికి ప్రత్యామ్నాయంగా పంట పొలాల్లో కొర్రలు, సామలు, రాగులు, సజ్జలు, జొన్నలు వంటి చిరుధాన్యాలను పండించాలని పిలుపునిచ్చారు. ప్రజలు కూడా చిరుధాన్యాల వైపు మళ్లాలని.. గట్కా, జావా, అంబలి వంటి సాంప్రదాయ ఆహారాలను తీసుకుంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు.

ప్రతి గ్రామంలో రైతు సమావేశాలు

రాబోయే కాలంలో కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనరసయ్య తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలు, పంట మార్పిడి విధానాలు, ప్రకృతి వ్యవసాయంపై రైతులను ఎడ్యుకేట్ చేసేందుకు క్షేత్రస్థాయిలో కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీస్ స్వచ్ఛంద సంస్థ చైర్మన్ నిమ్మయ్య ఆధ్వర్యంలో దాదాపు 250 మంది రైతులు, మహిళా రైతులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సదస్సులో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఊట్కూర్ అశోక్ గౌడ్, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాజేంద్ర రెడ్డి, కిసాన్ మోర్చా రాష్ట్ర జనరల్ సెక్రటరీ దేవర శ్రీనివాసు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తుమ్మల మురళీధర్ రెడ్డి, దాసరి మల్లేశం, పాశం భాస్కర్, కర్నాటి ధనుంజయ్, పి.ఎస్. రవీందర్, మాయ దశరథ, చందా మహేందర్, జిల్లా ఉపాధ్యక్షులు పట్నం శ్రీనివాస్, గూడూరు నరోత్తం రెడ్డి, జిల్లా కార్యదర్శి జనపెళ్లి శ్యాంసుందర్ రెడ్డి, కోటేష్, వైజయంతి, కమత్కరి కృష్ణ, తడిసిన మల్లారెడ్డి, సర్వే శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ సుచరిత, కిసాన్ మోర్చా జిల్లా జనరల్ సెక్రటరీలు నరసింహ యాదవ్, రాముల్ యాదవ్, కాలభైరవ రాజు, చుక్కారెడ్డి, తానేష్ గౌడ్, భువనగిరి రూరల్ మండల అధ్యక్షులు మాణిక్యం రెడ్డి, కోళ్ల భిక్షపతి, టౌన్ అధ్యక్షులు రత్నపురం బలరామ్, వివిధ మండలాల అధ్యక్షులు చిర్క సురేశ్ రెడ్డి, బొల్లు సుదర్శన్, కాశీనాథ్, పూజారి కుమార్, మేకల శీను, మేకల రవీందర్ రెడ్డి పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>