Mobile Popup Ad
Mobile Popup Ad

లక్నో అగ్ని ప్రమాద ఘటన.. పీఎం మోడీ, సీఎం యోగి దిగ్బ్రాంతి

కలం, వెబ్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో సోమవారం జరిగిన భారీ అగ్ని ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోడీ (Lucknow Fire Tragedy) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియాను ప్రధాని కార్యాలయం ప్రకటించింది. క్షతగాత్రులకు రూ.50 వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. అటు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఘటనపై ఆరా తీశారు. సహాయక చర్యలను స్వయంగా పరిశీలిస్తున్నారు. ఘటన దృష్ట్యా సీఎం యోగి తన అగ్ర పర్యటనను రద్దు చేసుకున్నారు. అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన సీఎం.. దోషులను శిక్షించేందుకు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు.

కాలిపోయిన భవనం.. 14 మంది మృతి!

లక్నోలోని పూర్నియాలోని కోచింగ్‌ సెంటర్‌లో మంటలు చెలరేగడంతో రెండు అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది. ప్రాణభయంతో కోచింగ్‌ సెంటర్‌ భవనం పైనుంచి విద్యార్థులు దూకారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 14కు చేరింది. ఘటన సమయంలో కోచింగ్‌ సెంటర్‌లో 30 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. మరికొందరికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నారు. సహాయక చర్యలను యూపీ డిప్యూటీ సీఎం బ్రిజేశ్‌ పాఠక్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మంటలను ఆర్పేందుకు 14 ఫైర్ ఇంజన్ లను అధికారులు రప్పించారు. భారీ నిచ్చెనలు, క్రేయిన్ ల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. ఎస్బీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది. మంటలు నుంచి తప్పించుకునేందుకు భవనంలోపల ఉన్న విద్యార్థులు కిందకు దూకేసిన దృశ్యాలు స్థానికులను భయాందోళనలకు గురిచేశాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>