కలం, వెబ్ డెస్క్: బతుకుదెరువు కోసం దుబాయ్ వెళ్లిన నిర్మల్ (Nirmal) జిల్లాకు చెందిన వ్యక్తి అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన విషాద ఘటన ఇది. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామానికి లగ్గం జగదీష్ (38) ఉపాధి కోసం వారం కిందటే దుబాయ్‌కు వెళ్లాడు. సోమవారం అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం అందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడికి భార్య కవిత, కుమారుడు వంశీ (14), కుమార్తె వైష్ణవి (12) ఉన్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న జగదీష్ మృతితో గ్రామస్థులు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు స్పందించి జగదీష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

