కలం, వెబ్ డెస్క్ : ఉత్తర్ ప్రదేశ్ లఖనవూ అలీగంజ్ ప్రాంతంలో భారీ అగ్నిప్రమాదం (Lucknow Fire Accident) సంభవించింది. మూడు అంతస్తుల వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. మంటలు వేగంగా వ్యాపించడంతో అదే భవనంలోని రెండో అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్ ను చుట్టుముట్టాయి. తీవ్ర భయాందోళనకు గురైన విద్యార్థులు ప్రాణభయంతో పరుగులు తీశారు. కొందరు విద్యార్థులు ప్రాణాలను రక్షించుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలో పలువురికి గాయలైనట్లు జాతీయ మీడియాలో ప్రచూరితమవుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. బిల్డింగ్ లో మరికొంతమంది చిక్కుకున్నట్లు అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మంటలను అదుపులోకి తెచ్చేందుకు, చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు రెస్క్యూ బృందాలు ప్రయత్నిస్తున్నాయి.

