Mobile Popup Ad
Mobile Popup Ad

ఇంట్రెస్టింగ్.. కిషన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ కీలక భేటీ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకోనుంది. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సా. 6.30కి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలవనున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ మెట్రో టేకోవర్, ఫేజ్ 2 విస్తరణ, ఐఆర్​ఎఫ్​సీ రుణాల విడుదల అంశాలపై చర్చ జరపనున్నారు.

కాగా, మెట్రో రైలు పెండింగ్ అంశాలపై సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య పొలిటికల్ వార్ కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే జూన్​ 22,23 తేదీల్లో తాను ఢిల్లీలో ఉంటానని .. తామిద్దరం కలిసి అశ్విని వైష్ణవ్ ను కలిసి మెట్రో రైలు పెండింగ్ అంశాలపై చర్చిద్ధామని సవాల్ చేస్తూ కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. దీంతో కేంద్ర రైల్వే శాఖ మంత్రితో వీరిద్దరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>