Mobile Popup Ad
Mobile Popup Ad

ఇసుక లారీ బీభత్సం.. ఆర్టీవో వెంకన్న మృతి

కలం, వరంగల్ బ్యూరో: భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో ఇసుక లారీ బీభత్సం సృష్టించింది. వాహనాలను ఆర్టీవో అధికారులు తనిఖీ చేస్తున్న సమయంలో బొగ్గు టిప్పర్ లారీ రవాణా శాఖ అధికారిని ఢీకొట్టింది. భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూర్ శివారులోని ఆర్టీవో కార్యాలయం ఎదుట పరకాల – భూపాలపల్లి హైవేపై ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (MVI) వెంకన్న అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతదేహం నుజ్జు నుజ్జు అయింది.

ఈ విషాద విషయం తెలిసి వెంకన్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. వెంకన్న 15 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>