కలం, వెబ్ డెస్క్: జిమ్‌లో వర్కౌట్స్ (Gym Workout) చేస్తూ ఓ కానిస్టేబుల్ గుండె పోటుతో మృతి చెందిన ఘటన ఉత్తరాఖండ్ (Uttarakhand)లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గిరీష్ భట్ రాష్ట్ర పోలీస్ శాఖలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చంపావత్‌లో నివాసం ఉంటున్న ఆయన రోజు మాదిరిగానే ఆదివారం తన జిమ్ వర్కౌట్స్ చేసుకుంటున్నారు. వర్కౌట్ ముగించుకొని ఓ మిషీన్ పై నుంచి దిగిన వెంటనే గిరీస్కు గుండె పోటు (Heart Attack) వచ్చింది. దీంతో నిలుచున్న చోటే ఆయన కుప్పకూలిపోయాడు. జిమ్‌లో ఉన్న వాళ్లు గమనించి గిరీష్ దగ్గరకు వచ్చి చూస్తుండగానే ప్రాణాలు కోల్పోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జిమ్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల కర్ణాటకలోని యంగ్ బాడీ బిల్డర్ సుశీల్ కుమార్ కూడా జిమ్ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఫిజికల్‌గా ఫిట్‌గా ఉన్నప్పటికీ జిమ్ వర్కౌట్లు చేసే వాళ్లు ఇలా గుండెపోటుతో అకాల మరణం చెందడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

