క‌విత సింగ‌రేణి బాయి బాట‌లో ఉద్రిక్తత!

క‌లం, వరంగల్​: భూపాలపల్లి (Bhupalpally)లో సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం టీఆర్ఎస్ పార్టీ చీఫ్​ కల్వకుంట్ల కవిత (Kavitha) చేపట్టిన సింగరేణి బాయిబాట (TRS Baayi Bata)లో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. 5 ఇంక్లైన్​ దగ్గర సింగరేణి సెక్యూరిటీ కవితను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. కేటీకే 5 బొగ్గు గనిని సందర్శించేందుకు కవిత, బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివెళ్లారు. అయితే కవితను పోలీసులతో పాటు సింగరేణి సెక్యూరిటీ సిబ్బంది గేటు వద్దే నిలిపివేశారు. గని లోపలికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ సెక్యూరిటీ అధికారులు పార్టీ శ్రేణులను అడ్డుకోవడంతో గని వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు, పోలీసుల మధ్య వాగ్వావాదం, తోపులాట జరిగాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>