ఫోన్‌పే యూజర్లకు అలర్ట్.. ఈ తప్పు చేస్తే ప్రతి 3 నెలలకు రూ.100 ఫైన్!

కలం, వెబ్‌డెస్క్: మనం రోజువారీ డిజిటల్ లావాదేవీల కోసం ఉపయోగించే యాప్‌లలో ఫోన్‌పే అత్యంత కీలకమైనదిగా చెప్పుకోవచ్చు. ఈ యాప్‌ను చాలామంది వాడుతారు. అయితే ఫోన్ పే వినియోగదారులకు షాకింగ్ న్యూస్ చెపుతూ కంపెనీ తన వాలెట్ నిర్వహణపై సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం వాలెట్ (PhonePe Wallet) వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

చాలామంది ఫోన్‌పే వాలెట్‌ను యాక్టివేట్ చేసుకుని ఉంటారు. బ్యాంక్ అకౌంట్ లేకపోయినా, యూపీఐ పిన్ (UPI PIN) ఎంటర్ చేయాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్న లావాదేవీలను వేగంగా చేసుకోవడానికి ఈ వాలెట్ ఆప్షన్ ఎంతో ఉపయోగపడుతుంది. అందుకే అనేకమంది దీనిని ఎనేబుల్ చేసుకున్నారు. అయితే, వాలెట్ యాక్టివేట్ చేసి, ఆ తర్వాత అసలు ఉపయోగించని వారికి ఫోన్‌పే ఇప్పుడు గట్టి షాక్ ఇచ్చింది. అలాంటి ఇన్‌యాక్టివ్ వాలెట్లపై జరిమానా విధించాలని కొత్త నిబంధనను తీసుకువచ్చింది.

ఇన్‌యాక్టివ్ వాలెట్లపై జరిమానా ఎంతంటే?

చాలా రోజుల పాటు వ్యాలెట్ వాడకపోతే అది ఇనాక్టివ్ అవుతుంది. ఇలా ఫోన్ పే వ్యాలెట్ ఇనాక్టివ్ అయిన వినయోగదారుకు నిర్వహణ ఛార్జీలు విధించాలని ఫోన్ పే నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రతి మూడు నెలలకు రూ.100 (జీఎస్టీతో కలిపి) ఫైన్ విధించంచనున్నట్లు తెలిపింది. ఈ మేరకు తమ కస్టమర్లకు నోటిఫికేషన్లు పంపించి అలర్ట్ చేస్తుంది. వాలెట్ బ్యాలెన్స్ రూ.100 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే ఫోన్‌పే నేరుగా రుసుంలను తీసుకుంటుంది. కానీ రూ.100 కంటే తక్కువగా ఉంటే అందుబాటులో ఉన్న అమౌంట్‌ను కట్ చేసుకుంటుంది. ఈ రుసుముల భారం మనపై పడకుండా ఉండాలంటే ఏడాదిలో పలుమార్లు వ్యాలెట్‌ను ఉపయోగించాలి. వ్యాలెట్ ద్వారా పేమెంట్స్ చేయడం, నగదు బదిలీ చేయడం లాంటివి చేయాలి.

ఎన్నాళ్లు వాడకపోతే ఫైన్ పడుతుంది?

వినియోగదారుడు తమ ఫోన్‌పే వాలెట్ ద్వారా సంవత్సరం పాటు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకపోతే వాలెట్ ఇనాక్టివ్ అవుతుందట. ఇలా ఇనాక్టివ్ అయిన వాలెట్‌లకు కంపెనీ ప్రతి మూడు నెలలకు ఒకసారి రూ.100 జరిమానా విధిస్తుంది. వాలెట్ ఇన్‌యాక్టివ్ వాలెట్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద వీటిని వసూలు చేస్తుంది. ఇనాక్టివ్ ఖాతాలను నిర్వహించేందుకు అదనపు వనరులను కేటాయించాల్సి వస్తుంది. అందుకే అటువంటి వాలెట్లపై మెయింటేనెన్స్ ఛార్జీలను విధించాలని కంపెనీ నిర్ణయించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>