ఈనెల 18న కరీంనగర్ జిల్లాలో కవిత పర్యటన

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar) నియోజకవర్గంలో జెండా పండుగ కార్యక్రమంతోపాటు ఈనెల 18వ తేదీన తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో రౌండ్‌ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు తెలంగాణ రక్షణ సేన కరీంనగర్ ‌బాధ్యులు గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులగా‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు ‌కల్వకుంట్ల కవిత (TRS Chief Kavitha) పాల్గొని వివిధ అంశాలను చర్చించనున్నట్లు తెలిపారు.

ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పనిచేసిన తెలంగాణ ఉద్యమకారులతో, రాష్ట్ర సాధనలో పనిచేసిన మేధావులతో.. ఇలా కవులు, కళాకారులతో సమాలోచనలు చేసి భవిష్యత్త్ లో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలోపాటు, తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం అన్ని వర్గాల ప్రజలతో కలిపి ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించనున్నారని అన్నారు.

Read Also: దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టారా? : ప్రధానిపై రాహుల్ తీవ్ర విమర్శలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>