డిప్యూటీ సీఎంకు కరీంనగర్‌లో ఘన స్వాగతం

కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ నుండి మంచిర్యాల జిల్లా పర్యటనకు వెళ్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka)కు రేణికుంట వద్ద రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఘన స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా కరీంనగర్ ఆర్‌ అండ్ బీ (R&B) గెస్ట్ హౌస్‌కు చేరుకున్న డిప్యూటీ సీఎంకు పోలీసు యంత్రాంగం గౌరవ వందనం సమర్పించింది. అక్కడ ఆయన పోలీసుల వందనాన్ని స్వీకరించారు. అనంతరం కరీంనగర్ జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, పోలీస్ కమిషనర్ (CP) గౌస్ ఆలంలు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి, పుష్పగుచ్ఛాలు అందించి ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>