భారీ ఉద్యమం.. దేశవ్యాప్త పర్యటనలు చేయనున్న రాహుల్ గాంధీ

కలం, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా భారీ ఉద్యమానికి జాతీయ కాంగ్రెస్ పార్టీ (Congress Party) సిద్ధమైంది. ఈ నెల 17 నుంచి ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) దేశవ్యాప్త పర్యటనలు చేయనున్నారు. ఈ నెల 17న కోటా, జులై 10న అలహాబాద్, 11న పాట్నా, 14న ఢిల్లీలో సదస్సులు నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే హయాంలో జరిగిన పేపర్ లీక్‌లు, పరీక్షల అవకతవకలు, నిరుద్యోగ అంశాలపై పోరాటం చేయనున్నారు. విద్యార్థులతో ముఖాముఖి సదస్సులు నిర్వహించి ఉద్యమాన్ని ఉదృతం చేయనున్నారు. దేశవ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్ష పేపర్ లీక్ దృష్ట్యా ప్రధానంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. రాహుల్ గాంధీ పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>