Mobile Popup Ad
Mobile Popup Ad

నిటారు కొండలపై విన్యాసాలు.. ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’ మృతి

కలం, వెబ్ డెస్క్ : ఎలాంటి రక్షణ కవచాలు, సేఫ్టీ గేర్ లేకుండా నిటారుగా ఉండే అత్యంత ప్రమాదకరమైన కొండలను సునాయాసంగా ఎక్కుతూ ‘రియల్ లైఫ్ స్పైడర్ మ్యాన్’గా గుర్తింపు తెచ్చుకున్న అల్-ఖాఖా అంతర్ (Al Qaqaa Antar) ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. యెమన్‌లోని అత్యంత ప్రమాదకరమైన కొండలతో పాటు దమత్ అగ్నిపర్వత క్రేటర్ (Volcanic Crater) పై విన్యాసాలు చేస్తూ ఆయన ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కేవలం సాహసాల కోసమే కాకుండా, తన జీవనోపాధి కోసం కూడా ఆయన ఇలాంటి ప్రమాదకరమైన పనులను ఎంచుకున్నారు.

ఎప్పటిలాగే ఎలాంటి భద్రతా ప్రమాణాలు పాటించకుండా దమత్ అగ్నిపర్వత కొండలపై విన్యాసాలు పూర్తి చేసి తిరిగి వస్తుండగా, ఒక్కసారిగా పట్టుతప్పి కాలుజారడంతో ఆయన కింద ఉన్న అగ్నిపర్వత నీటి గుండంలో పడిపోయారు. ఆ నీటి గుండం విపరీతమైన వేడితో, అత్యంత లోతుగా ఉండటంతో అల్-ఖాఖా అక్కడికక్కడే మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నీటి తీవ్రత, లోతు ఎక్కువగా ఉండటం వల్ల ఇప్పటివరకు ఆయన మృతదేహం లభ్యం కాలేదని తెలుస్తోంది. ఈ ప్రమాదంపై స్థానికులు, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>