ధర్మపురిలో మంత్రి అడ్లూరి ప్రత్యేక పూజలు

కలం, ధర్మపురి: ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (Adluri Laxman Kumar) వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వినాయక విగ్రహం ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు నిర్వహించే నవరాత్రులను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ధర్మపురి మున్సిపల్ ఛైర్మన్ వేముల నాగ లక్ష్మి, ధర్మపురి కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు చిలుముల లక్ష్మణ్, ధర్మపురి మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>