కేన్ విలియమ్సన్ రిటైర్మెంట్.. ఎమోష‌న‌ల్ గుడ్ బై..!

క‌లం, వెబ్ డెస్క్: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ (Kane Williamson) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 16 ఏళ్ల కెరీర్‌కు ముగింపు పలుకుతూ, ఈ నిర్ణయం ఒక్కసారిగా తీసుకున్నది కాదని, చాలా కాలంగా ఆలోచించిన తర్వాతే తీసుకున్నానని వెల్లడించాడు. జట్టుకు తాను చేయాల్సినంత చేశాననే భావనతో ఈ నిర్ణయానికి వచ్చానని తెలిపాడు. 2021లో జరిగిన తొలి ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్‌కు అందించిన కెప్టెన్‌గా విలియమ్సన్ ప్రత్యేక గుర్తింపు పొందాడు. రిటైర్మెంట్‌పై స్పందిస్తూ, లార్డ్స్‌లో ఆడిన చివరి టెస్ట్ తనకు ఎంతో ప్రత్యేకమైందని చెప్పాడు.

ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టులో అపార ప్రతిభ ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే సామర్థ్యం ఈ జట్టుకు ఉందని పేర్కొన్నాడు. అభిమానుల ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపిన విలియమ్సన్, తాను క్రికెట్‌కు పూర్తిగా దూరం కావడం లేదని స్పష్టం చేశాడు. కొత్త తరం ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాల్సిన సమయం వచ్చిందనే భావనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించాడు. తనను జట్టు కోసం అంకితభావంతో ఆడిన ఆటగాడిగా గుర్తిస్తే చాలని చెప్పాడు. ఇదిలా ఉండగా, ఐసీసీ ఛైర్మన్ జే షా విలియమ్సన్‌కు అభినందనలు తెలిపారు. అతని నాయకత్వం, వినయం, విజయాలు క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>