స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాల‌కు రూ.27 ల‌క్ష‌ల చెక్కులు ఇచ్చాం: అనిత‌

క‌లం, వెబ్ డెస్క్: వైజాగ్‌ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ప్ర‌మాదంలో మృతి చెందిన వారి కుటుంబాల‌కు త‌క్ష‌ణ‌ సాయంగా అదే రోజు సాయంత్రం రూ.27 ల‌క్ష‌ల చెక్కులు అందించిన‌ట్లు హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత (Vangalapudi Anitha) వెల్ల‌డించారు. గ‌తంలో స్టీల్ ప్టాంట్‌లో 12 మంది చ‌నిపోయార‌ని, అప్పుడు వైఎస్ జ‌గ‌న్ ఎవ‌రికైనా ప‌రిహారం కానీ, ఉద్యోగం కానీ ఇప్పించ‌గ‌లిగాడా అని ప్ర‌శ్నించారు. ప్లాంట్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన తొమ్మిది మంది కుటుంబాల‌ను ఎన్డీఏ కూట‌మి ఆదుకుంటుంద‌ని చెప్పారు.

గ‌తంలో ఏనాడూ ప‌రిహారం ఇవ్వ‌డం కానీ, ఉద్యోగం ఇవ్వ‌డం కానీ స్టీల్ ప్లాంట్ చ‌రిత్ర‌లో లేద‌న్నారు. ఒప్పంద కార్మికుల‌కు కూడా ప‌ర్మినెంట్ ఉద్యోగం ఇచ్చే బాధ్య‌త కూట‌మి ప్ర‌భుత్వం తీసుకుంద‌న్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల సంక్షేమానికి ఎవ‌రు క‌ట్టుబ‌డి ఉన్నారో ఇక్క‌డే అర్థ‌మ‌వుతుంద‌ని చెప్పారు. జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు స్టీల్ భూములు ఎత్తేసి రాజ‌ధాని క‌డ‌దామ‌ని అనుకున్నార‌ని నాడు ఆయ‌న‌తో క‌లిసి ప‌ని చేసిన అధికారులే చెప్పార‌న్నారు. జ‌గ‌న్ స్టీల్ ప్లాంట్ బాధితుల ప‌రామ‌ర్శ‌కు వ‌చ్చి కూడా రాజ‌కీయాలు చేశార‌ని హోం మంత్రి (Vangalapudi Anitha) విమ‌ర్శించారు.

Read Also: మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు కఠిన పరీక్ష: చోప్రా

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>