సరస్వతి కాలువకు నీటి విడుదలకు గ్రీన్ సిగ్నల్

కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) నియోజకవర్గ పరిధిలోని సరస్వతి కాలువ (Saraswathi Canal) పరివాహక ప్రాంత రైతుల సాగునీటి సమస్య పరిష్కారానికి నీటి విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమస్యపై కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు (Kuchadi Srihari Rao) రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) ని కలిసి రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు.

అనంతరం ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ రమేష్‌ బాబును కలిసి సరస్వతి కాలువ పరివాహక ప్రాంతంలోని పరిస్థితులను వివరించి, సాగునీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ నెల 13వ తేదీ నుంచి వారబందీ పద్ధతిలో సరస్వతి కాలువకు నీటిని విడుదల చేయాలని ఈఎన్‌సీ రమేష్‌ బాబుకు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>