‘ఝల్‌మురి’ ఆరగించిన మోదీ.. వడ్డించిన సీఎం

కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో జరుగుతున్న ఎన్డీఏ కూటమి పార్టీల సమావేశంలో ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. వివిధ రాష్ట్రాల వంటకాలు అక్కడ ఏర్పాటు చేయగా.. ప్రధాని మోదీ (PM Modi) ఒక్కో స్టాల్ తిరుగుతూ పరిశీలించారు. ఈ సందర్భంగా బెంగాల్‌ ఫేమస్ చాట్ ఝల్‌మురిని గమనించి అడిగి మరీ ఆరగించారు. సీఎం సువేందు అధికారి స్వయంగా కప్‌లో ఝల్‌మురి వేసి ప్రధానికి అందించారు. పక్కనే ఉన్న కేంద్ర మంత్రులకు కూడా ఇచ్చి, ఝల్‌మురి రుచిని ఆస్వాదించారు.

అప్పట్లో వైరల్..

బెంగాల్‌ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ ప్రచారం చేస్తూ, ఓ షాప్‌కు వెళ్లి ఝల్‌మురి తిన్న వీడియోలు నెట్టింట వైరలయ్యాయి. 24 గంటల్లోనే 100 మిలియన్ వ్యూస్ వచ్చి ట్రెండ్ రెసిపీగా సోషల్ మీడియాను షేక్ చేసింది. చాలా మంది ఈ చాట్‌ను తమ ఇళ్లల్లో తయారు చేసుకుంటూ వీడియోలు పోస్ట్ చేశారు.

Read Also: మెట్రో ఫుట్‌పాత్‌ల లీజుపై హైకోర్టు ఆగ్రహం.. GHMCకి నోటీసులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>