కలం, మహబూబ్‌నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా నూతన జిల్లా వైద్య & ఆరోగ్య శాఖాధికారిగా (DM&HO) డా. ఆలే శ్రీనివాసులు (Ale Srinivasulu) ను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రజా ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సంచాలకులు (DPH&FW) ఉత్తర్వులు జారీ చేశారు. ఆలే శ్రీనివాసులు నారాయణపేట జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (GGH) లో సివిల్ సర్జన్ రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్ (CS RMO) గా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయములోని (IDOC) కార్యాలయంలో రిపోర్ట్ చేసి, మహబూబ్ నగర్ జిల్లా నూతన వైద్య & ఆరోగ్య శాఖాధికారిగా (DM&HO) శ్రీనివాసులు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా డా. శశికాంత్ Dy DM&HO, డా. శైలజ PO CHI, డా. రాజు DLO, డా. శివకాంత్, డా. పులి విద్య AO, హెల్త్ ఎడ్యుకేటర్లు హన్మంతు, నర్సింహ, కార్యాలయ సిబ్బంది, ఇతర సిబ్బంది ఆలే శ్రీనివాసులును శాలువాలతో సన్మానించారు. అనంతరం శ్రీనివాసులు DM&HO ప్రోగ్రాం అధికారులు , కార్యాలయ సిబ్బంది, ఇతర అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరోగ్య కార్యక్రమాలు, PHC లలో ఆరోగ్య సేవలు ప్రభావ వంతంగా ప్రజలకు అందజేసి వారి ఆరోగ్య స్థాయిని మెరుగు పరచాలని సూచించారు. రాష్ట్రంలో జిల్లాను ఉత్తమ స్థానంలో నిలిపేందుకు అందరు సమన్వయంతో కృషి చేయాలని కోరారు.
Read Also: శ్రీరాంసాగర్ డెడ్ స్టోరేజ్.. సాగు సాధ్యమేనా!
Follow Us On: Sharechat

