జర్నలిస్టు సంక్షేమానికి తోడ్పాటు అభినందనీయం: యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: ఆపదలో ఉన్న జర్నలిస్టు సోదరులను ఆదుకోవడం నిజంగా అదృష్టమని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam) తెలిపారు. బుధవారం మహబూబ్ నగర్ (Mahabubnagar) ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అనారోగ్యానికి గురై చికిత్స పొందిన అనంతరం పాలమూరు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు జర్నలిస్టు సోదరులకు ఆర్థిక సహాయం అందించారు .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జర్నలిస్టు సంక్షేమ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇటీవల శస్త్ర చికిత్స చేసుకున్న ఎబీఎన్ వీడియో జర్నలిస్టు సంతోష్ కు రూ.20 వేలు, సీనియర్ జర్నలిస్టు ఎస్ ఎస్ జాంగీ తన మందులు కొనుగోలు నిమిత్తం రూ.10 వేల చెక్కులను ఎమ్మెల్యే యెన్నం (MLA Yennam) జర్నలిస్టు కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న తోటి జర్నలిస్టు సోదరులకు అండగా నిలిచి, ఆర్థిక సహాయం అందించడం అభినందనీయం అని కొనియాడారు. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో సైతం కొనసాగించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టు సంక్షేమ సంఘం అధ్యక్షులు వాకిట అశోక్ కుమార్, సభ్యులు పరిపూర్ణం, ప్రవీణ్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: ఎరువుల కరువు.. ఖరీఫ్ కష్టమే..!

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>