ఏపీలో క్రిటికల్ కేర్ బ్లాక్స్ ప్రారంభం

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య రంగానికి మరో భారీ ఊరట లభించింది. రాష్ట్రంలో ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా (JP Nadda), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) కీలక అడుగు వేశారు. విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్‌ (Critical Care Blocks)తో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన మరో 9 క్రిటికల్ కేర్ బ్లాకులు, 12 పబ్లిక్ హెల్త్ ల్యాబ్‌లను వీరిద్దరూ వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

ఈ ప్రారంభోత్సవానికి ముందు ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో జేపీ నడ్డా, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత మెరుగైన సమన్వయం, వైద్య ఆరోగ్య రంగంలో చేపట్టాల్సిన పలు కీలక ప్రాజెక్టులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. విజయవాడలో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), పలువురు స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>