కలం, నిజామాబాద్ బ్యూరో: నిజామాబాద్ (Nizamabad) జిల్లా డిచ్ పల్లి మండలంలో చిరుత సంచరిస్తోంది. ధూస్ గాం గ్రామం (Doosgaon Village)లోని శివాలయం గుట్టపై చిరుత సంచారం కలకలం రేపుతోంది. చిరుత కదలికలు గమనించిన మేకల కాపరులు ఆ దృశ్యాలను వెంటనే తమ కెమెరాలలో బంధించారు. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు శివాలయం గుట్ట ప్రాంతానికి చేరుకుని క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం భయాందోళన చెందవద్దని గ్రామస్తులకు సూచించారు. చిరుత కదలికలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని అధికారులు తెలిపారు. రాత్రి వేళలో ఒంటరిగా బయట తిరగొద్దని గ్రామస్తులకు అటవీశాఖ అధికారులు సూచించారు.
Also Read : ఖమ్మం సర్కారు దవాఖానా.. సేవల్లో సూపర్!
Follow Us On: X(Twitter)

