నేడు ఢిల్లీలో విపక్ష ఇండియా కూటమి సమావేశం

కలం, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు విపక్ష ఇండియా కూటమి (India Alliance) సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రజా పోరాటాలు చేయాలన్న ఎజెండాతో ఈ భేటీ జరగనుంది. తమ కూటమి భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనమని.. భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నా ఐక్యంగానే ఉన్నామని ఇండియా కూటమి చెబుతోంది. నేడు జరుగనున్న సమావేశానికి 23 పార్టీలు హాజరుకానున్నాయని స్పష్టం చేసింది, పలు రాష్ట్రాల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల వ్యూహాలపై ఇండి కూటమి చర్చించనున్నట్లు నేతలు తెలిపారు. ఈ సమావేశానికి డీఎంకే (DMK), ఆప్‌ (AAP) పార్టీలు దూరంగా ఉండనున్నాయి.

ఇప్పటికే కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి (India Alliance) నుంచి వైదొలుగుతున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దిల్లీలో నిర్వహించే సమావేశానికి తాము హాజరు కాబోమని స్పష్టం చేసింది. ఇప్పటికే డీఎంకే పార్టీ ఇండియా కూటమికి దూరంగా ఉండగా, ఆప్ కూడా తప్పుకోవడం గమనార్హం. అయితే టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం రేపటి సమావేశానికి హాజరు కానున్నారు. ఇప్పటికే తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీతో కలిసి ఢిల్లీ చేరుకున్నారు.

Read Also:  సీఎం రేవంత్ హిట్లర్ కన్నా ఎక్కువ.. ఆయన తాలిబన్: కవిత

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>