గుకేశ్ ఆటతీరుపై విమర్శలు.. కోచ్ స్ట్రాంగ్ కౌంటర్

కలం, స్పోర్ట్స్: ప్రపంచ చెస్ ఛాంపియన్ గుకేశ్ (Gukesh) ఆట తీరుపై వస్తున్న విమర్శలను ఆయన కోచ్ గ్రెగోర్జ్ గజెవ్‌స్కీ తిప్పికొట్టారు. రిస్క్ తీసుకుంటూ పోరాట పంథాలో ఆడటం గుకేశ్ వ్యక్తిత్వంలో భాగమని స్పష్టం చేశారు. ప్రస్తుతం గుకేశ్ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడని, ప్రపంచ ఛాంపియన్ కావడంతో అందరి దృష్టి అతడిపైనే ఉందన్నారు. గుకేశ్ మళ్లీ అత్యున్నత స్థాయికి చేరేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. గుకేశ్ ఆటలో మరింత జాగ్రత్తగా ఉండాలనే సూచనలు వస్తున్నా, అదే దూకుడు అతడిని ప్రపంచ ఛాంపియన్‌గా నిలబెట్టిందని గజెవ్‌స్కీ గుర్తు చేశారు. ఆ టైటిల్ సాధించేందుకు గుకేశ్ ఎన్నో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నాడని, ఇప్పుడు అతడి శైలిని తప్పుబట్టలేమని చెప్పారు.

గుకేశ్‌పై పూర్తి విశ్వాసం ఉంది..

గుకేశ్ (Gukesh) ఆట తీరుపై ప్రజ్ఞానంద, మాగ్నస్ కార్ల్‌సెన్, అతడి కోచ్ పీటర్ హైన్ నీల్సన్ సహా పలువురు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. కోచ్ గజెవ్‌స్కీ మాత్రం గుకేశ్‌పై పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. రెండేళ్ల కిందట గెలిచిన ప్రపంచ ఛాంపియన్‌షిప్ గుకేశ్ కెరీర్‌లో అత్యున్నత స్థాయి కాకూడదని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కనిపిస్తున్న బలహీనతలు అప్పట్లో కూడా ఉన్నాయని, బహుశా ఇంకా ఎక్కువగానే ఉన్నాయని తెలిపారు. ఆ సమయంలో అతడిలో అసాధారణ ఆత్మవిశ్వాసం ఉండేదని చెప్పారు. గుకేశ్‌ మెరుగుపడే అవకాశం చాలా ఉందని, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే సామర్థ్యం అతడికి ఉందనే నమ్మకాన్ని కోచ్ వ్యక్తం చేశారు.

Read Also:  సీఎం విజయ్‌‌తో చెస్ ఆడిన ప్రజ్ఞానంద

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>