కలం, వెబ్ డెస్క్ : భారత ఉపరాష్ట్రపతి (Vice President) సి.పి. రాధాకృష్ణన్ నేటి నుంచి రెండు రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు. డిసెంబర్ 20, 21 తేదీల్లో జరిగే ఈ పర్యటనలో ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పోలీసులు హైదరాబాద్‌లో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉపరాష్ట్రపతి (Vice President Radhakrishnan) రాధాకృష్ణన్ డిసెంబర్ 20న శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి నేరుగా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్లనున్నారు. అక్కడ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ల ఛైర్‌పర్సన్ల జాతీయ సదస్సు ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు.
డిసెంబర్ 21న నందిగామలోని కన్హా శాంతి వనంలో జరిగే ‘వరల్డ్ మెడిటేషన్ డే’ ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఇక్కడ ధ్యాన సెషన్‌లో పాల్గొని, ప్రసంగించనున్నారు. ఉప రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసింది.
Read Also: నేడు ఎల్‌బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Instagram


