Mobile Popup Ad
Mobile Popup Ad

హిట్ అండ్ రన్ కేసు: లొంగిపోయిన మాజీ ఎమ్మెల్యే కుమారుడు

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ హిట్ అండ్ రన్ కేసు (Jubilee Hills Hit and Run Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహెల్ ఎట్టకేలకు పోలీసుల ముందు లొంగిపోయారు. 2022లో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45లో జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది.

గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఈ కేసులో అరెస్టు కాకుండా తప్పించుకున్న రాహెల్, తాజాగా పోలీసుల ముందుకు వచ్చి లొంగిపోవడం ఆసక్తికరంగా మారింది. రెండేళ్ల క్రితం జరిగిన ఈ ఘటనలో అప్పట్లో రాజకీయ పలుకుబడితో ఆయన బయట తిరిగారనే విమర్శలు ఉన్నాయి. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోలేమని భావించి కోర్టు ఆదేశాల మేరకు ఆయన పోలీసులకు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Read Also: వీగిన మహిళా బిల్లు.. పొలిటికల్ గేమ్ షురూ

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>