భక్త కనకదాసు జీవితం లోకానికి స్ఫూర్తిదాయకం: బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

కలం, జోగులాంబ గద్వాల: కురువల ఆరాధ్య దైవం శ్రీ భక్త కనకదాసు జీవిత చరిత్ర ఈ లోకానికి స్ఫూర్తిదాయకమని ఆయన అడుగుజాడల్లో ప్రతి ఒక్కరూ నడవాల నడవాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల‌ కృష్ణమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. శ్రీ భక్త కనకదాసు 539వ జయంతి (Bhakta Kanakadasa Jayanti) సందర్భంగా శుక్రవారం కేటీ దొడ్డి మండలం చింతలకుంట, కుచినెర్ల గ్రామాల్లో శ్రీ భక్త కనకదాసు విగ్రహానికి‌‌ పూలమాల‌ వేసి‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే మాట్లాడుతూ… భక్త కనకదాసు జీవితంలో ఎన్నో విశేషాలను నేటి ప్రజలు ఆయన అడుగుజాడలను నడుచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆనాడు ఆయనకు ఆయన భక్తికి మెచ్చి శ్రీకృష్ణుడే సాక్షాత్తు దైవదర్శనం ఇచ్చినటువంటి గొప్ప వాగ్గేయకారుడని పేర్కొన్నారు. నేటి కురవ కులానికి ఆరాధ్య దైవంగా భావించడం మన అందరి అదృష్టం అని వారు పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి కనకదాసు జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గద్వాల నియోజకవర్గంలో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కురువ సంఘం నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>