కలం, వెబ్ డెస్క్: ఈతరం పిల్లలు అల్లరి చేయడంలోనే కాదు.. ఏదైనా ప్రమాదం ఎదురైతే గట్టిగానూ పోరాడగలరు. అందుకే ఉదాహరణే ఈ ఒడిశా (Odisha) బాలుడు. ఒడిశాలోని కటక్ (బంకీ) సమీపంలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ కెనాల్లో స్నానం చేస్తున్న 14 ఏళ్ల బాలుడిపై ఒక్కసారిగా అడవి పంది దాడి చేసింది. అయితే ఏమాత్రం భయపడకుండా ఆ బాలుడు దాదాపు 2 గంటల పాటు అడవి పందితో పోరాడాడు.
తన ప్రాణాలు కాపాడుకునేందుకు, దాని మెడను గట్టిగా పట్టుకున్నాడు. ఏకంగా 30 నిమిషాల దానిని వదలకుండా చివరి వరకు పోరాడాడు. స్థానికులు అక్కడికి చేరుకుని, అడవి పందిని తరిమికొట్టి బాలుడిని కాపాడారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో బాలుడి ధైర్యాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ‘‘ఈ బుడ్డొడు చాలా గట్టివాడు‘‘ అంటూ కామెంట్లు చేస్తున్నారు.
అడవి పంది తో బాలుడు సాహసం
-ఒడిశాలోని కటక్ (బంకీ) సమీపంలో ఓ కెనాల్లో స్నానం చేస్తున్న 14 ఏళ్ల బాలుడిపై ఒక్కసారిగా అడవి పంది దాడి
-దాదాపు 2 గంటల పాటు అడవి పందితో పోరాడి ప్రాణాలు కాపాడుకున్న బాలుడు
14-Year-Old Odisha Boy Fights Off Wild Boar for Two Hours in Canal#Odisha… pic.twitter.com/JJHLjwVafC— Kalam Daily (@kalamtelugu) August 26, 2026

