నేపాల్‌లో ఆకస్మిక వరద బీభత్సం.. కొట్టుకుపోయిన గ్రామాలు, రోడ్లు..!

కలం, వెబ్ డెస్క్ : నేపాల్ (Nepal Flood ) దేశాన్ని ఆకస్మిక వరదలు వణికించాయి. చైనా సరిహద్దుకు సమీపంలోని రసువా జిల్లాలో కోశీ నదిలో ఒక్కసారిగా వరద ఉద్ధృతి పెరగడంతో భారీ విధ్వంసం చోటుచేసుకుంది. ఈ వరద బీభత్సంతో రసువా జిల్లా పరిధిలోని ఇళ్లు, రహదారులు, వంతెనలు, వాహనాలు, విద్యుత్ వసతులు ప్రవాహంలో కొట్టుకుపోయాయి. ఈ ఘటనలో పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతు అయినట్లు తెలుస్తోంది.

భారీ విపత్తు నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీస్, ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్, స్థానిక విపత్తు నిర్వహణ బృందాలు రంగంలోకి దిగాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆకస్మిక వరదకు కారణం ఏమిటన్న దానిపై పూర్తి స్పష్టం ఇంకా రాలేదు.

బీహర్ సరిహద్దు ప్రాంతాల్లో హైఅలర్ట్

కోశీ నది దిగువకు ప్రవహించి బీహర్ లోని నదీ వ్యవస్థతో అనుసంధానమవుతున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తం అయింది. బీహర్ సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రజలు అప్రత్తంగా ఉండాలని సూచించింది. ఆయా ప్రాంతాలకు చేరుకున్న భద్రతా సిబ్బంది పరిస్థితిని పరిశీలిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>