ప్రమాదవశాత్తూ ఆటోపై నుండి పడి బాలుడు మృతి

కలం,‌ జోగులాంబ గద్వాల: ప్రమాదవశాత్తూ ఆటో పైనుంచి కింద పడి ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మంగళవారం మల్దకల్ (Maldakal) మండలం చోటు చేసుకుంది. ​గ్రామస్తులు, పోలీసుల కథనం ప్రకారం.. పాల్వాయి గ్రామానికి చెందిన చాకలి బీసన్న కుమారుడు రాకేష్(14) మంగళవారం మల్దకల్ మండల కేంద్రంలో నిర్వహించు పశువుల సంతకు ఆటోలో బయలుదేరాడు. రాకేష్ (14) ఆటో పైన ఎక్కి కూర్చున్నాడు. ఈ క్రమంలో పెద్దపల్లి గ్రామం సమీపంలోకి రాగానే ఆటో డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో పైన కూర్చున్న రాకేష్ ప్రమాదవశాత్తూ కింద పడి తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

సమాచారం అందుకున్న మల్దకల్ ఎస్ఐ శ్రీహరి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు మల్దకల్ ఎస్సై శ్రీహరి తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>