Mobile Popup Ad
Mobile Popup Ad

తమిళనాడులో ఘోర ప్రమాదం

కలం డెస్క్ : తమిళనాడు(Tamil Nadu)లోని తిరుపత్తూరు(Tirupathur) సమీపంలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటనలో తొమ్మిది మంది మహిళలతో పాటు మొత్తం 11 మంది అక్కడికక్కడే మృతి చెందారు. మరో 40 మంది తిరుపత్తూరు, కారైక్కుడి(Karaikudi) ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల్లో రెండు బస్సుల డ్రైవర్లు కూడా ఉన్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించి ప్రాథమిక వివరాలు సేకరించిన తిరుపత్తూరు కలెక్టర్ పొర్కొడి అక్కడి ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళి గాయపడినవారిని పరామర్శించారు. అవసరమైన అన్ని రకాల వైద్య సేవలను అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు.

శివగంగై జిల్లా తిరుపత్తూరు(Tirupathur) సమీపంలోని వైరవన్‌పట్టి సమీపంలో ఎదురెదురుగా రెండు ఆర్టీసీ బస్సులు ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఢీకొన్నాయి. ఒక బస్సు కారైక్కుడి నుంచి దిండుక్కల్ వెళ్తుండగా మరో బస్సు తిరుప్పూర్ నుంచి కారైక్కుడికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనపై నాచ్చియాపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసుల ప్రాథమిక విచారణలో దిండుక్కల్ వైపు వెళ్తున్న బస్సు అతి వేగంగా వచ్చి ఢీకొట్టినట్లు తెలిసింది.

Read Also: 37 మంది మావోయిస్టుల లొంగుబాటు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>