జగిత్యాలలో విషాదం.. కరెంట్ షాక్‌తో 10 నెలల చిన్నారి మృతి!

కలం, వెబ్ డెస్క్: జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లి (Rajarampalli) గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరెంట్ షాక్ కు గురై 10 నెలల చిన్నారి మృతిచెందిన ఘటన స్థానికులను, కుటుంబ సభ్యులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

వివరాల్లోకి వెళితే.. విభూది ఆద్య అనే 10 నెలల చిన్నారి ఇంటిలో ఆడుకుంటూ ఛార్జింగ్ పెట్టిన విద్యుత్ కాంటాను ముట్టుకోవడంతో ఒక్కసారిగా షాక్ కు గురైంది. గమనించిన తల్లిదండ్రులు కాపాడుకునే లోపే చిన్నారి ప్రాణాలు విడిచింది. చిన్నారి మరణంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Also Read : ఓటు హక్కు కోసం ప్రకాష్ రాజ్‌ సంచలన పిలుపు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>