కలం, వెబ్ డెస్క్ : బాలీవుడ్ నటి తాన్యా ఛటర్జీపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ (Chahal) న్యాయపోరాటానికి దిగారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడిందనే కారణంతో ఆమెపై ఆయన పరువునష్టం దావా వేశారు.
కొద్ది రోజుల క్రితం చాహల్ తనకు వ్యక్తిగతంగా మెసేజ్‌లు పంపిస్తున్నారంటూ తాన్యా ఛటర్జీ సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట తీవ్ర దుమారం రేపాయి. ఒక సీనియర్ క్రికెటర్ గురించి ఇలాంటి వార్తలు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన చాహల్, తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తాన్యా వ్యవహరించిందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఆమెకు లీగల్ నోటీసులు పంపడంతో పాటు కోర్టులో పరువునష్టం దావా వేశారు. తనపై వస్తున్నవన్నీ నిరాధారమైన ఆరోపణలని, చట్టపరంగానే దీనికి ముగింపు పలుకుతానని చాహల్ (Chahal) వర్గం స్పష్టం చేసింది.
Read Also: రాత్రి 8.30 గంటలకు ప్రధాని ప్రసంగం
Follow Us On: Instagram

