Mobile Popup Ad
Mobile Popup Ad

విజయ్ దేవరకొండ నుంచి మరో భారీ సినిమా దర్శకుడు ఎవరంటే ?

కలం, సినిమా : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)  ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ పెడుతున్నాడు. రూటు మార్చి సరికొత్త కథాంశాలను ఎంచుకుంటున్నాడు. తాజాగా విజయ్ దేవరకొండ తన తరువాత సినిమాను ప్రకటించాడు. నానితో హాయ్ నాన్న వంటి ఎమోషనల్ డ్రామా తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv)  డైరక్షన్‌లో విజయ్ తన 15వ చిత్రాన్ని ప్రకటించాడు. సినిమా ప్రకటన సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ ఎంతో పవర్ఫుల్ గా ఉంది.

శౌర్యువ్ డైరక్షన్‌లో విజయ్ భారీ యాక్షన్ సినిమా చేస్తున్నట్లు తెలుస్తుంది. VD x Shouryuv అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా ద్వారా మూవీ టీమ్‌ను అధికారికంగా పరిచయం చేస్తూ ఒక ఎమోషనల్ నోట్ షేర్ చేశాడు. ‘ఈ ఇంటిమిడేటింగ్ ఫిల్మ్‌ను రూపొందించడానికి ముందుకొచ్చిన ఈ గ్లోబల్ టీమ్‌తో కలిసి పని చేయడం చాలా ఆనందంగా ఉంది.

శౌర్యువ్ వైల్డ్ ఇమాజినేషన్, ఇంటెన్స్ హార్ట్‌తో ఈ ప్రాజెక్ట్ మరింత  ప్రత్యేకంగా ఉండబోతోంది. ఈ సినిమాకు ఇంటర్నేషనల్ లెవల్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్లు విజయ్ ప్రకటించాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా హేషమ్ అబ్దుల్ వహాబ్, సినిమాటోగ్రాఫర్‌గా సురేష్ రాజన్, ఎడిటర్‌గా ప్రవీణ్ అలాగే అలెహాండ్రో మార్టినెజ్, ఎరిక్ డర్స్ట్, సచిన్ లోవలేకర్ వంటి గ్లోబల్ టాలెంట్ కూడా ఈ మూవీలో భాగం అయినందుకు సంతోషంగా ఉందని విజయ్ (Vijay Deverakonda) ట్వీట్ చేశాడు.

Read Also: ‘అందుకే విడిపోయాం’.. విడాకులపై హన్సిక స్పందన

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>