Mobile Popup Ad
Mobile Popup Ad

రాత్రి 8.30 గంటలకు ప్రధాని ప్రసంగం

కలం, వెబ్ డెస్క్ : ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) రాత్రి 8.30 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయిన తరువాత మొదటి సారి మాట్లాడబోతుండటంతో.. దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొన్నది. ఉదయం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో, ప్రధాని మోదీ ప్రతిపక్షాల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడిన విషయం తెలిసిందే. మహిళా రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించి విపక్షాలను పొలిటికల్‌గా డ్యామేజ్ చేస్తారా? లేక రాజ్యాంగ సవరణ బిల్లుతో కేంద్ర ప్రభుత్వ ప్లాన్‌ను విపక్షాలు భగ్నం చేయడంతో జరిగిన డ్యామేజ్‌ను కంట్రోల్ చేసుకునే తీరులో మాట్లాడతారా?.. ఇలాంటి సస్పెన్స్ నెలకొన్నది.

నిన్న పార్లమెంటులో 131వ రాజ్యాంగ సవరణ బిల్లు–2026ను ప్రతిపక్షాలు అడ్డుకోవడంతో మహిళా రిజర్వేషన్ల (Women Reservation Bill) అమలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీనిపై, దేశ వ్యాప్తంగా బీజేపీ, ఎన్డీయే పార్టీలు నిరసనలు తెలుపుతున్నాయి. దీంతో నేటి ప్రధాని మోదీ (PM Modi) ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకున్నది. తమిళనాడు, పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జాతిని ఉద్దేశించి ప్రధాని మోడీ టీవీ ద్వారా స్పీచ్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంతో ఆ స్పీచ్‌లో ఏయే అంశాలను ప్రస్తావిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మహిళా రిజర్వేషన్ బిల్లుపై విపక్షాలపై విమర్శలు చేస్తారా?.. ఊహకు అందని తీరులో తీసుకున్న సంచలన నిర్ణయాన్ని వెల్లడిస్తారా?.. మరికొన్ని గంటల్లో తేలనున్నది. కేంద్ర క్యాబినెట్ అత్యవసర సమావేశం జరిగిన తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగించడం ఒక ఆనవాయితీగా కొనసాగుతున్నది. ఈసారి కూడా అదే రిపీట్ అవుతున్నది.

Read Also: బీజేపీ బ్రహ్మాస్త్రానికి బ్రేక్ వేసిన ‘ఇండియా’

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>