‘ప్రతి ప్రక్రియలోనూ హైజాక్!’: జగన్ సంచలన ట్వీట్

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో (Municipal Elections) క్లీన్ స్విప్ దిశగా కూటమి ప్రభుత్వం దూసుకెళ్తున్న వేళ వైసీపీ అధినేత జగన్ (YS Jagan) ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, అధికార యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల సంఘం, పోలీసుల సహకారంతో సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రక్రియ మొత్తాన్ని తారుమారు చేసిందని మండిపడ్డారు. నామినేషన్ల దాఖలు నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ వైసీపీ అభ్యర్థులు, ఏజెంట్లను అడ్డుకుని అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు.

ఈ మేరకు సీఎం చంద్రబాబు టీమ్, పోలీస్, రాష్ట్ర ఎన్నికల సంఘంకు అభినందనలు అంటూ సెటైర్లు వేశారు. ప్రతిపక్షానికి పోటీ చేసే అవకాశం లేకుండా చేయడం ద్వారా ఎన్నికలలో అద్భుతంగా ఎలా గెలవవచ్చో మీరు నిరూపించారంటూ ఎద్దేవా చేశారు. నామినేషన్, పరిశీలన, ఉపసంహరణ, పోలింగ్ ఏజెంట్ల నిర్వహణ, పోలింగ్, పోలింగ్ శాతం, లెక్కింపు.. ఇలా ప్రతి ప్రక్రియను హైజాక్ చేసి, రిగ్గింగ్ చేశారని దుయ్యబట్టారు. ప్రజలు అభ్యర్థులను ఎన్నుకోలేదని, ప్రభుత్వమే తమకు నచ్చిన వారిని ఎంపిక చేసుకుందని, ఇది ఇకపై ఎన్నికల ప్రక్రియ ఎంతమాత్రం కాదని జగన్ (YS Jagan) వ్యాఖ్యానించారు.

Also Read : జగన్ కంచుకోట బద్దలు!: పులివెందులలో కూటమి జయకేతనం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>