జైలు నుంచి 17 మంది ఖైదీల పరారీ.. ఒకరి అరెస్ట్!

కలం, వెబ్ డెస్క్ : తమిళనాడులోని తేని జిల్లా అల్లినగరం సబ్-జైలు నుంచి సోమవారం రాత్రి 17 మంది ఖైదీలు పోలీసులపై దాడి చేసి పరారయ్యారు (Tamil Nadu Jailbreak). ఒకే గదిలో ఉన్న ఈ ఖైదీలు నకిలీ వైద్య అత్యవసర పరిస్థితిని సృష్టించి, భద్రతా సిబ్బందిని కొట్టి అక్కడి నుంచి తప్పించుకున్నారు. పరారైన వారిలో ఎక్కువ మంది మదురై జిల్లాకు చెందినవారే ఉన్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే దక్షిణ జోన్ ఐజీ విజయేంద్ర బిడారి ఆధ్వర్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. పరారైన ఖైదీలను పట్టుకోవడానికి 17 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అంతర్రాష్ట్ర, సరిహద్దు ప్రాంతాల్లోని చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశారు. పొరుగున ఉన్న దిండిగల్ జిల్లాలో 16 కొత్త చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఈ గాలింపు చర్యల్లో భాగంగా పోలీసులు ఒక ఖైదీని (ప్రవీణ్ కుమార్, మదురై) అరెస్ట్ చేశారు. మిగతా 16 మంది పరారీలో ఉన్న ఖైదీల కోసం గాలింపు తీవ్రతరం చేశారు. పొరుగు జిల్లాల పోలీసులను కూడా అప్రమత్తం చేసి హైఅలర్ట్ ప్రకటించినట్లు అధికారులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>